Yentha Sakkagunnave lachimi Song Lyrics | Rangasthalam | Ram Charan, Samantha, Devi Sri Prasad, Sukumar Lyrics - Devi Sri Prasad
Movie | Rangastalam |
Star Cast | Ramcharan,Samanta |
Director | Sukumar |
Producer | Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri |
Singer | Devi Sri Prasad |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
Lyrics
ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకే బిందెలాగ
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
సింతా సెట్టు ఎక్కి… సిగురు కొయ్యబోతే
సేతికి అందిన సందమామ లాగా
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
మల్లెపూలా మద్య ముద్ధ బంతిలాగా
ఎంత సక్కగున్నావే
ముతైదువా మెల్లో పసుపు కొమ్ములాగా
ఎంత సక్కగున్నావే
సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెలలాగా
ఎంత సక్కగున్నావే
ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలినా లంకే బిందెలాగ
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
సింతా సెట్టు ఎక్కి… సిగురు కొయ్యబోతే
సేతికి అందిన సందమామ లాగా
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
ఓ ఓ యే యే ఓ ఓ యే యే
ఎలలె లేలే ఏలేలే… ఎలలె లేలే ఒయ్యా
ఎలలె లేలే ఏలేలే… ఎలలె లేలే ఎలలె లేలే హోయ్యా
ఏలేలే హోయ్యా
ఓ, రెండు కాల్ల సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినావు… అలల మూటలిప్పెసినావు
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
మబ్బులేని మెరుపువి నువ్వు… నేల మీదా నడిసేసినావు
నన్ను నింగి సేసేసినావు
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
సెరుకు ముక్క నువ్వు… కొరికి తింటావుంటే
ఎంత సక్కగున్నావే, ఏ ఏ
సెరుకు గడకే… తీపి రుసి తెలిపినావే
ఎంత సక్కగున్నావే, ఏ ఏ
తిరునాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
గాలి పల్లకీలో… ఎంకి పాటాలాగ
ఎంకి పాటలోన… తెలుగు మాటలాగా
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
కడవ నువ్వు నడుమున బెట్టి
కట్టా మీద నడిసొత్తవుంటే
సంద్రం నీ సంకెక్కినట్టు
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
కట్టెలమోపు తలకెత్తుకోని
అడుగులోనా అడుగేత్తవుంటే
అడివి నీకు గొడుగెట్టినట్టు
ఎంత సక్కగున్నవే, లచ్చిమి… ఎంత సక్కగున్నావే
బురద సేలో వరి నాటు ఏత్తావుంటే
ఎంత సక్కగున్నావే, ఏఏ
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు

Post a Comment