Amma Song Lyrics | OKE OKA JEEVITHAM | Sharwanand, Ritu Varma | Jakes Bejoy | Sid Sriram Lyrics - Sid Sriram

Amma Song Lyrics | OKE OKA JEEVITHAM | Sharwanand, Ritu Varma | Jakes Bejoy | Sid Sriram Lyrics - Sid Sriram


Amma Song Lyrics | OKE OKA JEEVITHAM | Sharwanand, Ritu Varma | Jakes Bejoy | Sid Sriram
Singer Sid Sriram
Composer Jakes Bejoy
Music Jakes Bejoy
Song WriterSirivennela Seetharama Sastry

Amma Lyrics in Telugu

అమ్మా.. వినమ్మా.. నేనానాటి.. నీ లాలి పదాన్నే
ఓ.. అవునమ్మా.. నేనేనమ్మా.. 
నువు యేనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్ళూ.. నిదరలోనే ఉన్నా
గానమై ఈనాడే.. మేలుకున్నా

నీ పాదాలకు మువ్వల్లా.. నా అడుగులు సాగాలమ్మా
నీ పెదవుల చిరునవ్వుల్లా.. నా ఊపిరి వెలగాలమ్మా...
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ...
నిన్నొదిలేంతగ యెదగాలనుకోనే.. అమ్మా
అణువణువణువూ నీ కొలువే.. అమ్మా
యెదసడిలో శృతిలయలు నువ్వే.. అమ్మా....
నే కొలిచే శారదవే
ననునిత్యం నడిపే సారథివే


బెదురు పోవాలంటే.. నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే.. కథలు వినిపించాలీ
ఆకలయ్యిందంటే.. నువ్వె తినిపించాలి
ప్రతి మెతుకు.. నా బ్రతుకనిపించేలా...
నువ్వుంటేనే నేను.. నువ్వంటే నేను
అనుకోలేకా పోతే   ఏమయిపోతానూ
నీ కడచూపే నన్ను   కాస్తూ ఉండకా
తడబడిపడిపోనా చెప్పమ్మా..

మరి మరి నను నువు మురిపెముగా
చూస్తూ ఉంటే చాలమ్మా
పరి పరి విధముల గెలుపులుగా
పైకెదుగుతూంటానమ్మా...
అయినా సరే.. యేనాటికీ
ఉంటాను నీ పాపాయినయ్
నిన్నొదిలేంతగ యెదగాలనుకోనే...

నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ...
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెనాళ్ళకీ..

నిన్నొదిలేంతగ యెదగాలనుకోనే అమ్మా....
అణువణువణువూ నీ కొలువే  అమ్మా....
యెదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా''''
నే కొలిచే శారదవే.. 
ననునిత్యం నడిపే.. సారథివే

Amma Lyrics in  English




Amma Song Lyrics | OKE OKA JEEVITHAM | Sharwanand, Ritu Varma | Jakes Bejoy | Sid Sriram Watch Video

Post a Comment

أحدث أقدم