Oo Antava Mawa..Oo Oo Antava Sont Lyrics | Pushpa Songs | Allu Arjun| DSP |Sukumar |Samantha

Oo Antava Mawa..Oo Oo Antava Sont Lyrics | Pushpa Songs | Allu Arjun| DSP |Sukumar |Samantha - Indravathi Chauhan Lyrics


Oo Antava Mawa..Oo Oo Antava Sont Lyrics | Pushpa Songs | Allu Arjun| DSP |Sukumar |Samantha
Singer Indravathi Chauhan
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterChandrabose

Lyrics

కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు

కోకా కాదు… గౌను కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే… వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..

తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు
నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..

ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు
కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు

ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..

బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు

బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..
హాయ్, ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా ..

పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు

మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాకా..!!
ఊ ఊ ఊ ఊ, దీపాలన్నీ ఆర్పేసాకా
అందరి బుద్ధి… వంకర బుద్ధే

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా ..
ఊ అంటామే పాప
ఊ ఊ అంటామా పాప

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా ..
ఊ అంటామే పాప
ఊ హు అంటామా పాప

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా..

Pushpa Movie Songs Lyrics




Oo Antava Mawa..Oo Oo Antava Sont Lyrics | Pushpa Songs | Allu Arjun| DSP |Sukumar |Samantha Watch Video

Post a Comment

أحدث أقدم