SarangaDariya Song Lyrics |Love story Songs |Naga Chaitanya |Sai Pallavi |Sekhar Kammula |Pawan Ch Lyrics - Mangli
Movie | Lovestory |
Star Cast | Naga Chaitanya, SaiPallavi |
Director | Shekar Kammula |
Producers | Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao |
Singer | Mangli |
Composer | Pawan CH |
Music | Pawan CH |
Song Writer | Suddala Ashok Teja |
Lyrics
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
కాళ్ళకు ఎండీ గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్..
నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమల పాకుల్
మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితదిర మన దిల్
చురియా చురియా చురియా అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
రంగేలేని నా అంగీ జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగీ మర్లపడితే అది శివంగీ
తీగలు లేని సారంగీ వాయించబోతే అది ఫిరంగీ
గుడియా గుడియా గుడియా అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా
దాని సెంపలు ఎన్నెల కురియా
దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
إرسال تعليق