Naa Kosam Marava Nuvvu Song Lyrics in Telugu |Bangarraju | Naga Chaitanya | Krithi Shetty | Anup Rubens | Sid Sriram
Movie | Bangarraju |
Star Cast | Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty |
Director | Kalyan Krishna Kurasala |
Producer | Zee Studios, Annapurna Studios |
Singer | Sid Sriram |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer | Balaji |
Lyrics
కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో
అంతగా నాకర్ధం కాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస
లేకుండా చేశావు
మాటల్లేని మంత్రం వేసి
మాయలోకి తోశావూ
నా కోసం మారావా నువ్వూ
లేక, నన్నే మార్చేశావా నువ్వూ
నాకోసం మారావా నువ్వూ
లేక, నన్నే మార్చేశావా నువ్వూ
ఓ, నవ్వులే చల్లావు
పంచుకోమన్నావు
తొలకరి చిరుజల్లై నువ్వూ
కళ్లకే దొరికావు… రంగుల మెరిసావు
నేలపై హరివిల్లా నువ్వూ
నిన్నా మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మారాలన్నీ
మంచులాగ మార్చావు
నీకోసం మారానే నేనూ
నీతో నూరేళ్లు ఉండేలా నేనూ
నీకోసం మారానే నేనూ
నీతో నూరేళ్లు ఉండేలా నేనూ
ఓ, మాటలే మరిచేలా
మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ
ఓ ఓఓ, కన్నులే అడిగేలా
చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలా
నాకే ఈవేళా నేనే నచ్చా నీ వల్లా
మోమాటాలే దూరం చేసే
మాట నీకు చెప్పేలా
ఓ ఓఓ, నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
إرسال تعليق