Priya Ragale Gundelona Song Lyrics In Telugu | Hello Brother Movie | Nagarjuna, Ramyakrishna,Sowndharya
Movie | Hello Brother |
Star Cast | Nagarjuna, Ramyakrishna,Sowndharya |
Director | E.V.V.Satyanarayana |
Producer | S. Gopal Reddy & K.L. Narayana |
Singer | S P Balasubramanyam, KS Chitra |
Composer | Raj-Koti |
Music | Raj-Koti |
Song Writer | Chandra Bose |
Lyrics
ఓ ఓ… ఓ ఓ…ఓ
ఓ ఓ… ఓ ఓ…ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
చేరాలి సొగసుల తీరం… సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం… తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియాగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
అల్లరి కోయిల పాడిన పల్లవి… స్వరాలలో నీవుంటే
పదాలలో నేనుంటా…
వేకువ పూచిన తొలి తొలి గీతిక… ప్రియా ప్రియా నీవైతే..
శృతిలయ నేనవుతా…
కలకాలం కౌగిలై… నినే చేరుకోని
కనురెప్పల నీడలో… కలే ఒదిగి పోనీ…
ఓ ప్రియా…ఓ… దరిచేరితే దాచుకోనా…
తొలి ప్రేమలే… దోచుకొనా…
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
సవ్వడి చేయని యవ్వన వీణలు… అలా అలా సవరించు…
పదే పదే పలికించు…
వయసులు కోరిన వెన్నెల మధువులు… సఖి చెలి అందించు…
సుఖాలలో తేలించు…
పెదవులతో కమ్మనీ… కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా… చలే కాచుకోనా…
ఓ ప్రియా…ఓ… పరువాలనే పంచుకోనీ…
పడుచాటలే సాగిపోనీ…
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
చేరాలి సొగసుల తీరం… సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం… తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
إرسال تعليق