Durgamu paina kanaka durga vai velasitiva song Lyrics
దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితివా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
దుర్గము పైన కనకదుర్గ వై వెలసితివా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
కార్తీక పౌర్ణిమ చంద్రుని పోలిన ముఖ కళలూ
కార్తీక పౌర్ణిమ చంద్రుని పోలిన ముఖ కళలూ
ప్రణతార్తిని తీర్చే నాద విందుమయ చిత్కళలూ
ప్రణతార్తిని తీర్చే నాద విందుమయ చిత్కళలూ
అమ్మా.. దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
సుంభని సుంభుల డంభము నణచినా శుభదాయీ
మహిషాసుర సంహారము చేసిన మహా మాయీ..
సుంభని సుంభుల డంభము నణచినా శుభదాయీ
మహిషాసుర సంహారము చేసిన మహా మాయీ..
రాజస కల్మస భంజని రంజని రాగమయీ ..
రాజస కల్మస భంజని రంజని రాగమయీ ..
శుభ కారుణ్యామృత సాత్విక వర్షిణి కనుదోయి
శుభ కారుణ్యామృత సాత్విక వర్షిణి కనుదోయి
నీ కనుదోయి
దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
నవరాత్రులలో జరిగే ఉతసవ నవ శోభా
కాంచిన వారికి కైవల్యమృత కలితాభా
నవరాత్రులలో జరిగే ఉతసవ నవ శోభా
కాంచిన వారికి కైవల్యమృత కలితాభా
వాహనంబులను అధిరోహించే వైభవ దర్శనము
వాహనంబులను అధిరోహించే వైభవ దర్శనము
ఈ మానవ కోటికి ప్రసాదించు ను మంగళమూ
మంగళమూ
దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
కలిలోజనులకు ముక్తిని నొసగే కల్పతరువు
నీవే కల్పతరువు
నీవు భామలకెల్లా పసుపు కుంకుమలిడు కామధేనువు ..
నీవే కామధేనువు ..
నీ అభిషేకములు రాసిన వేళా అలరును అణువణువూ
నీ అభిషేకములు రాసిన వేళా అలరును అణువణువూ
సహస్రారమున స్రవియించెనూ శశి మధువూ
నా సహస్రారమున స్రవియించెనూ శశి మధువూ
శశి మధువూ...
దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
కార్తీక పౌర్ణిమ చంద్రుని పోలిన ముఖ కళలూ
కార్తీక పౌర్ణిమ చంద్రుని పోలిన ముఖ కళలూ
ప్రణతార్తిని తీర్చే నాద విందుమయ చిత్కళలూ
ప్రణతార్తిని తీర్చే నాద విందుమయ చిత్కళలూ
అమ్మా.. దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
తాప వర్గము బాపగ విజయవాడ లో వెలసితివా..
అమ్మా.. దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా
అమ్మా.. దుర్గము పైన కనకదుర్గ వై నిలిచితి వా..
إرسال تعليق