God Father Title Song Lyrics in Telugu | Megastar Chiranjeevi | Nayanthara | Thaman S | Mohan Raja- GOD FATHER
Movie | GOD FATHER |
Star Cast | Megastar Chiranjeevi, Salman Khan, Nayanthara, Puri Jagannadh, Satya Dev |
Director | Mohan Raja |
Producer | Ram Charan, R B Choudary, N V Prasad |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | 'Saraswatiputhira' Ramajogayya Sastry |
GodFather Title Song Lyrics in Telugu
ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి
అంతే లేని ఆధిపత్య శౌరి
దండించే దండధారి
శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ద పాటం
నల్ల దందా నాగలోకం
వీడు తొడిగే అంగుళీకం
కర్మ భూమి లోన
నిత్య ధర్మ గామి
వేటుకొక్క చెడును
వెటలాడు సామి
ఎక్కడుంటేనేమి
మంచికితడు హామీ
ఒక్క మాట లోన
సర్వాంతర్యామి..
గాడ్ ఫాదర్.. గాడ్ ఫాదర్.. గాడ్ ఫాదర్..
ఆకాశం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం
వీడో ధ్యేయం వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం
వీడో ధైర్యం వీడి పలుకు పాంచజన్యం
అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందలేని ఘటం వీడే
లక్షలాది గుండె సడుల చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే..
మంచి చెడ్డ పోల్చలేని ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని తర్కం వీడే
పై కంటి చూపు చూడలేని మర్మం వీడే
కారుణించే కర్త కర్మ వీడే....
إرسال تعليق